జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దించాలి
వీబి జీ రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి
ప్రజలకు ఉపాధి హక్కు పంచాయతీలకు పాలన హక్కులు తిరిగి కల్పించాలి
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ డిసిసి భవన్ లో హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన శనివారం ఏఐసిసి, టీపీసీసీ ఆదేశాల మేరకు వీబి జీ రామ్ జీ చట్టం తీసుకొచ్చి పథకం పేరు మార్చేందుకు కుట్రలుకు నిరసనంగా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజులు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమాన్ని శాంతి, అహింస మార్గంలో ముందుకు తీసుకెళ్లిన జాతిపిత మహాత్మా గాంధీ పేరు దేశ చరిత్రలో స్థిర స్థాయిగా నిలిపోతుందని అలాంటి మహానేత పేరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్రం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించామని తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తీవ్రంగా ఖండించారు పేదల కోసం రూపొందించి అమలు చేస్తున్న పథకాలను నిర్వీర్యం చేయడం అని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కొట్లాది కుటుంబాలు జీవనాధారం పొందుతున్నాయని అలాంటి పథకాలను అడ్డుకోవడం పేదల పాలిట శాపంగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరగాల్సి ఉందని హమీల అమలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పదేళ్లు గడిచిన మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు ఎందుకు చర్యలు లేవని ప్రశ్నించారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నీదర్శనమని అన్నారు. బిజెపితో పాటు బిఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల చేసిన ద్రోహాలను ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులకు కర్తవ్యంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.






