10-01-2026 08:48:24 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ తులిప్స్ గ్రాండ్ హోటల్ లో ఉప్పల్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆకుల సత్యనారాయణ ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, మాజీ మంత్రి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని 2026 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ ఆవిష్కరించి, అసోసియేషన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యు బి ఏ భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుని, అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలన్నారు.