28 February, 2026 | 7:01 PM

సైంటిస్టులు అయితే లక్ష రూపాయల నగదు పురస్కారం

28-02-2026 05:16 PM

కడెం,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ లింగాపూర్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎంపికైతే లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని అందిస్తారని ఉపాధ్యాయుడు వి కిషన్ ప్రకటించారు.  శనివారం  పాఠశాల ఆవరణలో “జాతీయ సైన్స్ దినోత్సవం“ను ఘనంగా నిర్వహించారు.  శాస్త్రవేత్తలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని హెడ్మాస్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ లింగాపూర్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ కాలేరి భూమేశ్వర్, సైన్స్ టీచర్లు బాలాజీ, శ్రీదేవి,విశ్వనాథ్ రెడ్డి, మహేష్ మరియు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. ‎