ఫీజు బకాయి బిజెపి లడాయి
ఒకే విడతలో ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించాలి
జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్
కొత్తగూడెం ఆగష్టు 29 విజయక్రాంతి: కొత్తగూడెం బస్టాండ్ అమర వీరుల స్తూపం వద్ద యువ మోర్చా అధ్యక్షులు,జజ్జూరు మోహన కృష ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పిలుపుమేరకు విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి అని కోరుతూ, నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విద్యార్థులకు,ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడుతూ,
నాడు బిఆర్ఎస్ ప్రభుత్వం నేడు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ వాగ్దానాలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం కొత్తగూడెం అమరవీరుల స్తూపo బస్టాండ్ సెంటర్ వద్ద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో, నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన గుప్పిట్లో పెట్టుకుని విద్యార్ధుల భావిభారత భవిషత్ ను నిర్వీర్యం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల సుమారు 40 లక్షల మంది పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన దాదాపు రూ.15,000 కోట్ల ఫీజు బకాయిలు నిలిచిపోవడంతో కళాశాల యాజమాన్యాలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక, సరి అయిన సమయంలో సర్టిఫికెట్లు పొందలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని
రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.15,000 కోట్ల బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా, జిల్లావ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉగ్రరూపంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు, డాక్టర్ జాటోత్ వెంకన్న, బిక్షపతి, బోగి కృష్ణ, కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, కిసాన్ మోర్చా అధ్యక్షులు గొట్టిపుల్ల దుర్గా శ్రీనివాసరావు, మహబాద్ పార్లమెంట్ కన్వీనర్ ముసుకు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు భూక్య శ్రీను, మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, గిరిజన మోర్చా అధ్యక్షురాలు భూక్యా స్వాతి, ఓబీసీ మధ్య అధ్యక్షులు జటంగి కృష్ణ, ఎస్సీ మోర్చా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ కుమార్ బాబు, జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ బిమల్ కుమార్ జైన్, జిల్లా కార్యదర్శిలు రఘురాం, దురుశెట్టి కుమార్, మీడియా కన్వీనర్ కోలికపోగు రామారావు, మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, పల్లపు వెంకటేశ్వర్లు, ముత్యాల శ్రీనివాసరావు, బిక్షపతి, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి కోలా హరీష్, నాయిని శ్రీనివాస్, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి సలీం, గుమలాపురపు సత్యనారాయణ, మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






