జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
18-03-2026 12:00 AM
మహబూబాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ తండ్రి లచ్య నాయక్ గూడూరు మండలం మచ్చర్ల శివారు తార్య తండాలో కన్నుమూశారు. లచ్య నాయక్ మరణ వార్త తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర నలుమూలల నుండి మచ్చర్లకు చేరుకొని దివంగత లచ్య నాయక్ భౌతిక కాయంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం పితృవియోగానికి గురైన హుస్సేన్ నాయక్ ను పరామర్శించారు.




