19 March, 2026 | 1:42 AM

పరీక్షలు ప్రశాంతంగా రాస్తే మంచి ఫలితాలు

18-03-2026 12:00 AM

నాగర్ కర్నూల్ మార్చి 17 ( విజయక్రాంతి )నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదా వత్ సంతోష్ తెలకపల్లి మండలం గౌరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఆయన, పరీక్షల మధ్య ఉన్న సమయాన్ని సద్వినియో గం చేసుకుని పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సూచించారు.కష్టపడి చదివిన విషయా లను ప్రశాంతంగా, ఆసక్తితో రాస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.

సమయపాలన పాటిస్తూ ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, సులభమైన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలని సూచించారు.హాల్ టికెట్ నంబర్, ప్రశ్న నంబర్లను సరిగా నమోదు చేసి ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలని, ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేస్తూ సంక్షి ప్తంగా సమాధానాలు రాయాలని చెప్పారు.

గైడ్లపై ఆధారపడకుండా స్వయంగా అర్థం చేసుకుని రాయాలని ప్రోత్సహించారు.పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వం టివని పేర్కొంటూ, ఏ ప్రశ్నను వదలకుండా జాగ్రత్తగా రాయాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లు వేగంగా పూర్తి చేయాలి.

జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి వచ్చేనెల 20 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తెలకపల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, సామగ్రి కొరత లేకుండా చూడాలని సూచించారు. లబ్ధిదారుల సమస్యలను వెంటనే పరిష్కరించి గృహాలను సమయానికి అందించాలని తెలిపారు.