4 May, 2026 | 12:51 PM

Breaking News

బెంగాల్ బీజేపీదే.! భవానీ పూర్‌లో ఆధిక్యంలో మమతా బెనర్జీ   •   22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •  

జాతీయ గణాంక దినోత్సవ వేడుకలు

30-06-2025 12:00 AM

నిర్మల్ జూన్ 27( విజయక్రాంతి) : కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం జా తీయ గణాంక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గణాంక శాస్త్ర ప్ర ఖ్యాత శాస్త్రవేత్త ప్రొఫెసర్ పి.సి. మహాలనోబీస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జి ల్లా ముఖ్య ప్రణాళికాధికారి జీవరత్నం మా ట్లాడుతూ, దేశానికి బలమైన గణాంక మౌ లిక వ్యవస్థను రూపొందించడంలో ప్రొఫెసర్ మహాలనోబీస్ చేసిన సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం ఆయన జయంతి జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటామని తెలిపారు.

ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటూ 202324 సంవత్సరానికి సంబంధించిన జిల్లా గణాంక హ్యాం డ్బుక్ను ఈ సందర్భంగా విడుదల చేశారు. వేడుకల్లో రిటైర్డ్ గణాంక శాఖ అధికారులు మోహన్ దాస్, హన్మండ్లు, డిగ్రీ కళాశాల అధ్యాపకులు రమేష్, జిల్లా గణాంక శాఖ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.

ఆధునిక భారత గణాంక పితామహుడి మహలనోబిస్ : జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

అదిలాబాద్, జూన్ 29 (విజయ క్రాంతి) : గణాంకాలు, ఆర్థిక ప్రణాళికా రంగంలో మహలనోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏటా జూన్ 29న జాతీయ గణాంక ది నోత్సవం గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం తీర్మానించిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని 19వ జాతీయ గణాంక దినోత్సవాన్ని ఆదివారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో  ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ సంద ర్భంగా ప్రశాంత చంద్ర మహలనోబిస్ చిత్ర పటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయాదాయాన్ని అంచనా వేయడంలో, ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో గణాంకాలు ముఖ్యపాత్ర పోషి స్తాయని వీటిని సేకరించే కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతోపాటు గణాంక కార్యకలాపాలను సమన్వయం చేయడానికి మహలనోబిస్ వివిధ సంస్థలు, పద్ధతులను ఏర్పాటు చేశారన్నారు.

అందుకే ఆయన్ని ’ఆధునిక భారత గణాంక పితామహుడి’ గా పిలుస్తారన్నారు. సామాజిక, ఆర్థిక ప్రణాళికల్లో గణాంకాల ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఈయన 1936లో ’మహలనోబిస్ డిస్టెన్స్’ అనే భావనను ప్రవేశపెట్టారని, గణాంకాల సేకరణలో ఇది విప్లవాత్మక మార్పులు  తెచ్చిందన్నారు.

రెండో పంచవర్ష ప్రణాళికలో దేశంలో పారిశ్రామికీకరణ ప్రణాళిక లను రూపొందించి, అభివృద్ధి చేయడంలో ము ఖ్యపాత్ర పోషించారు. 1972, జూన్ 28 న మరణించారని తెలిపారు. ఈ కార్యక్రమం లో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటరమణ, డివిజనల్, మండల గణాంక అధికా రులు, కార్యాలయ సిబ్బంది  పాల్గొన్నారు.