02-02-2026 12:10:03 AM
కరీంనగర్, ఫిబ్రవరి౧ ( విజయక్రాంతి): సహజ యోగాతో శారీరక, మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చని సహజ యోగా ట్రస్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరీకృష్ణ ప్రసాద్, రాష్ట్ర కమిటీ మెంబర్ వినోద్ వర్మ, డా. మంగారెడ్డి, కరీంనగర్ కో ఆర్డినేటర్ రవీంద్రచారి అన్నారు. కరీంనగర్లోని ఓ పాఠ శాలలో ఆదివారం సాయంత్రం సహజ యోగా పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మా తాజీ నిర్మల దేవి 1977లో ప్రపంచ మానవళికి యోగాను పరిచయం చేసిందన్నారు. 140 దేశాల్లో సహజ యోగాను కోనసాగిస్తున్నారని, నిరంతరం యోగా చేయడం వల్ల సమస్యలను అధిగమించడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందుతారని అన్నారు.