హర్షిత్ రాణా స్థానంలో నవదీప్ సైనీ
కోల్‌కతా, మార్చి 25: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందు గాయాలతో దూరమైన ఆటగాళ్ల స్థానాల్లో ఫ్రాంచైజీలు రీప్లేస్‌మెంట్స్ వెతుక్కుంటు న్నాయి. గాయంతో తప్పుకున్న హర్షిత్ రాణా స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ నవదీప్ సైనీని తీసుకుంది. అతని కనీస ధర రూ.75 లక్షలకు రీప్లేస్‌మెంట్‌గా దక్కించుకుం ది. ఇప్పటికే కేకేఆర్ జట్టుతో కలిసిన సైనీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నవదీప్ సైనీ తన ఐపీఎల్ కెరీర్‌లో 32 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు పడగొ ట్టాడు.
గతంలో మూడు సీజన్ల పాటు ఆర్‌సీబీ కి ఆడిన సైనీ 2023లో చివరిసారిగా రాజ స్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఓవరాల్ టీ20 కెరీర్‌లో మంచి ఎకానమీతో ఉన్న సైనీ మినీవే లంలో అమ్ముడుపోలేదు. అయి తే ఇప్పుడు హర్షిత్ రాణాకు రీప్లేస్‌మెంట్‌గా అవకాశం దక్కింది. ప్రస్తుతం కోల్‌కతా జట్టులో పతిరణ తప్పిస్తే ఒక్క స్టార్ పేసర్ కూడా లేడు.
ఈ సీజన్‌లో కోల్‌కతా తన తొలి మ్యాచ్‌ను మార్చి 29న మంబైతో ఆడనుంది. ఇదిలా ఉంటే గుజరాత్ టైటాన్స్ స్కాడ్‌లో నూ మార్పు జరిగింది. తెలుగు కుర్రాడు పృథ్వి రాజ్ యర్రా గాయపడడంతో అతని స్థానం లో గుజరాత్ ఫ్రాంచైజీ కుల్వంత్ ఖేజ్రోలి యాను తీసుకుంది. ఖేజ్రోలియా 2018లో ఆర్‌సీబీ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు.




