calender_icon.png 18 January, 2026 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టడీ మెటీరియల్ ఆవిష్కరించిన నవీన్ నికోలస్

18-01-2026 05:50:24 PM

మర్రిగూడ,(విజయక్రాంతి): పిఆర్ఆర్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందిస్తున్న రాష్ట్ర విజన్ బుక్ హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పి ఆర్ ఆర్ ఫౌండేషన్ వారు విద్యార్థుల అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతి విద్యార్థుల మంచి ఫలితాలకై ఈ మెటీరియల్ ఉపయోగపడుతుంది.

విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ప్రాక్టీస్ చేయాలని దీంతో పాటు మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరే విధంగా ప్రభుత్వంతో పాటు పిఆర్ఆర్ లాంటి ఫౌండేషన్ వారు విద్యార్థుల చేయూత కోసం భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో రూపొందించాలని వాటికోసం మా వంతు ప్రోత్సాహం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్య నాయక్ పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు