calender_icon.png 18 January, 2026 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలి

18-01-2026 05:53:13 PM

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎన్హెచ్ఎం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎన్హెచ్ఎం ఉద్యోగస్తుల సమస్యలు పెండింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలు ఇప్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో 78 క్యాలెండర్లలో 17వేల ఉద్యోగులు పనిచేస్తున్నారని వారిని అందరిని రెగ్యులరైజ్ చేయాలని కోరడం జరిగింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వచ్చే నెలలో సీఎంతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న జీతాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు డాక్టర్ మహేందర్ రావు, పుట్ట మహమ్మద్ రుక్ముద్దీన్, మొగిలి, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.