calender_icon.png 18 January, 2026 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్రాల శ్రీశ్రీశ్రీ దత్తావతార్ కార్తీక మహారాజ్ ఆలయంలో పూజలు

18-01-2026 05:46:42 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుక పెళ్లి 'బి' అభయ ఆంజనేయస్వామి ఆలయం నుండి మహారాష్ట్రలోని చెప్రాలకు భక్తులు 21 మహా పాదయాత్ర నిర్వహించారు. మహా పాదయాత్రగా చేరుకున్న భక్తులను ఆలయ కమిటీ భాజా భజంత్రీలతో ఘన స్వాగతం పలికి శ్రీశ్రీశ్రీ దత్తవతార్ కార్తీక మహారాజ్ చిత్రపటంతో శోభయాత్రగా ఆలయానికి శనివారం సాయంత్రం పాదయాత్ర భక్తులు చేరుకున్నారు. 

పాదయాత్ర భక్తులకు ఎమ్మెల్యే అన్నదానం..

మహా పాదయాత్రగా వెళ్లిన  భక్తులకు సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయగా పాదయాత్ర భక్తులకు భాజపా నాయకులు శనివారం రాత్రి అన్న ప్రసాదం వితరణ చేశారు. 

 ఆలయంలో ప్రత్యేక పూజలు..

శ్రీశ్రీశ్రీ దత్తవతార్ కార్తీక్ మహారాజ్ ఆలయంలో మహా పాదయాత్ర నిర్వాహకులు కొండవీటి భాస్కర్ రాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటలకు ప్రాణహిత నదికి వెళ్లి బాజా భజంద్రిలతో గంగ నీటిని తీసుకువచ్చి జలాభిషేకం నిర్వహించి శ్రీశ్రీశ్రీ దత్తావతార్ కార్తీక మహారాజ్ విగ్రహానికి, సమాధిపై, హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూలతో అలంకరణ నిర్వహించారు. అనంతరం పాదపూజ, హారతి, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు.

ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం

భక్తులకు ఎమ్మెల్సీ దండేవిటల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ యువసేన నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ యువసేన నాయకులను సాల్వతో సత్కరించి కార్తీక మహారాజ్ చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సిద్ధాపూర్ సర్పంచ్ చెండే పద్మ శంకర్, సిర్పూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాచకొండ శ్రీ వర్ధన్, మాజీ ఉపసర్పంచ్ సుధాకర్ గౌడ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కొట్రంగి రామకృష్ణ, మండల కన్వీనర్ మహేష్, సామల తిరుపతి, కవ్వాలా సాయి, అర్చకులు శ్రీనివాస్ చారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.