04-12-2025 01:38:06 AM
డాక్టర్ లేకపోవడంతో మొన్న పాము కాటుతో బాలుడు మృతి చెందిన ఘటన ఇక్కడే
కన్నాయిగూడెం, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి బుధవారం రోజు డాక్టర్ లేక మూసీ ఉంది ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో ఉన్న గూర్రేవుల గ్రామానికి చెందిన ధర్మయ్యను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ డాక్టర్, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఖాళీ గదు లే దర్శనమిచ్చాయి.
అత్యవసర సమయాల్లో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కుటుంబం తప్పనిసరిగా 40 కి.మీ దూరంలోని ఏటూరునాగారం 108 వాహనంలో తరలించడం జరిగింది. కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు బాగలేక పోవడంతో ప్రజలు ప్రభుత్వం, పాలన అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాము కాటు కారణంగా ఇటీవల ఓ బాలుడు మృతి చెందిన ఘటనలో కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వై ద్యుడు లేకపోవడం,పాము కాటుకి విరుగు డు ఇంజక్షన్ అందుబాటులో లేకపోవడం ఆరోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేసిం ది. విమర్శల నేపథ్యంలో సంబంధిత డాక్టర్ ను బదిలీ చేసి జిల్లా యంత్రాంగం చేతులు దులుపుకున్నారు అయిన కూడా కన్నాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎలాంటి మార్పు లేకపోవడం ప్రజలను మరింత నిరాశకు గురిచేస్తోంది.