calender_icon.png 20 January, 2026 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనదుర్గా ఆలయం కిటకిట

04-11-2024 12:46:18 AM

 పాపన్నపేట, నవంబర్ 3 : ఏడుపాయల వన దుర్గాభవానీ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మెదక్ జిల్లా నుంచే కాక పలు జిల్లాల నుంచి భక్తులు బారీగా తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానమాచరించి, కొన్నిగంటల పాటు క్యూలైన్లలో నించొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేశారు.