ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అప్రమత్తత అవసరం
కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ ప్రశాంత్
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వయసు పెరిగేకొద్దీ పురుషుల్లో ప్రోస్టేట్ సమస్యలు(prostate problems) పెరిగే అవకాశం ఉందని కిమ్స్ హాస్పిటల్స్(KIMS Hospitals) సికింద్రాబాద్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యూరో-ఆంకో, ఆండ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్, రోబోటిక్ సర్జన్ డా క్టర్ వైఎం ప్రశాంత్(Prashanth) తెలిపారు. తరచూ మూత్రం రావడం, మూత్రం ప్రారంభించడంలో ఇబ్బంది, మూత్రధార బలహీనపడటం, రాత్రిపూట పలుమార్లు మూత్రానికి లేవడం వంటి లక్షణాలను కేవలం వయసు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate cancer) ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు(Symptoms) లేకుండానే ఉండొచ్చని, 50 ఏళ్లు దాటిన పురుషులు(mens), కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు తమ ప్రమాదాన్ని వైద్యుల(Doctors)తో చర్చించాలని సూచించారు. పీఎస్‌ఏ పరీక్ష ద్వారా ప్రోస్టేట్‌కు సంబంధించిన అసాధారణతలపై సూచన లభించినప్పటికీ, పీఎస్‌ఏ పెరగడం తప్పనిసరిగా క్యాన్సర్ అని అర్థం కాదన్నారు. అవసరాన్ని బట్టి ఎం ఆర్‌ఐ, డీఆర్‌ఈ, బయాప్సీ వంటి పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
క్యాన్సర్ నిర్ధారణ అయిన ప్రతి ఒక్కరికీ వెంటనే శస్త్రచికిత్స అవసరం లేదని, క్యాన్సర్ దశ, గ్రేడ్, రోగి వయసు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా చికిత్సను నిర్ణయిస్తామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో యాక్టివ్ సర్వైలెన్స్, శస్త్రచికిత్స, రేడియేషన్, హార్మోన్ థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఆధునిక సాంకేతికతతో తుల్సా ప్రో చికిత్స అందించవచ్చన్నారు.






