3 September, 2026 | 3:17 AM

రెప్కో హోం ఫైనాన్స్ రీజినల్ ఆఫీస్ ప్రారంభం

03-09-2026 | 02:05am

అమీర్‌పేటలో ఏర్పాటు

హైదరాబాద్, సెప్టెంబర్ 2(విజయక్రాంతి) : గత 25 సంవత్సరాలుగా గృహ రుణాల(home loans) విషయంలో ఖాతాదారులకు మెరుగైన సే వలు అందిస్తున్నామని రెప్కో హోం ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె కరుణాకరన్(K. Karunakaran) అన్నారు. రెప్కో బ్యాంక్ అనుబంధ సంస్థ రెప్కో హోం ఫైనా న్స్ లిమిటెడ్ హైదరాబాద్ రీజియన్ ఆఫీస్(Repco Home Finance Limited Hyderabad Regional Office) బుధవారం హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో ప్రారంభించారు. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.