గుంజేడు ముసలమ్మ ఆలయ నూతన ఈవోగా నీడిగొండ సత్యనారాయణ
24-07-2026 02:13 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గుంజేడు ముసలమ్మ తల్లి దేవాలయ నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా నీడిగొండ సత్యనారాయణ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గురువారం నూతన ఈవో సత్యనారాయణముసలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.






