24 July, 2026 | 2:42 PM

ఛలో బెంగళూరు ను విజయవంతం చేద్దాం

24-07-2026 02:11 PM

ముకరంపుర, జూలై 24(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరించుటకు ఆగస్టు 7న జరిగే ఛలో బెంగళూరు ను విజయవంతం చేయాలని విద్యార్థి కేంద్ర కమిటీ అధ్యక్షులు తాటికొండ  విక్రమ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 7న బెంగళూరులో జన జ్యోతి ఆడిటోరియం నందు జరిగే అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభను విజయవంతం చేయాలని అందుకు కరీంనగర్ నుండి అత్యధికంగా ఓ బి సి ప్రజలు, విద్యార్థులు, మహిళలు ,మేధావులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుల గణన చేపట్టి 42% రిజర్వేషన్ అమలు చేయాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు 50%, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని ,ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని, తదితర డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేసి సాధించుకోవాలని అందుకు ఉద్యమమే మార్గమని సూచించారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ మరియు జిల్లా బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు