13 May, 2026 | 7:35 PM

కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే నీట్ పరీక్ష పత్రం లీక్

13-05-2026 07:01 PM

బోథ్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే నీట్ ప్రవేశ పరీక్షల పేపర్ లీకేజీ దేవారం కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బద్దం పోతారెడ్డి విమర్శించారు. విద్యార్థులు కష్టపడి చదివిన చదవంత కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నీరు గారిపోయిందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటుందని ఆరోపించారు.

నీట్ పరీక్ష రద్దు వల్ల ఎంతో మంది విద్యార్థులు మానసికంగా కృంగిపోతున్నారని వాపోయారు. పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మౌలానా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి లింగన్న క్రాంతికుమార్ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు