బీరప్ప స్వామి దయతో ప్రజలు చల్లగా ఉండాలి
13-05-2026 07:04 PM
గాంధారిపల్లిలో బీరప్ప స్వామి జాతర ఉత్సవాల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి
పాపన్నపేట: పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప స్వామి జాతర మహోత్సవాల్లో మండల నాయకులతో కలిసి మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి పాల్గొని బీరప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీరప్ప స్వామి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు, పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయన్నారు.






