calender_icon.png 6 May, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ విద్యార్థిని ఆత్మహత్య

06-05-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, మే 5 (విజయక్రాంతి): నీట్ పరీక్షలో ర్యాంకు రాదని అనుమానంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామనికి చెందిన జంగా పూజ (18) అనే విద్యార్ధిని ఇం ట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

పూజ రెండు సంవత్సరాల క్రితం నీట్ ప్రవేశ పరీక్ష రాయగా ర్యాంకు రాకపోవడంతో రెండోసారి తాజాగా నీట్ ప్రవేశ పరీక్ష రాసింది. ఇంటికి వచ్చి నీట్ ప్రవేశ పరీక్ష కీ చూసుకోగా అనుకున్న  ర్యాంక్ రాదేమోనని అనుమానంతో మనస్థాపానికి గురైన పూజ, ఇంట్లో ఎవరు లేని సమయంలో   ఉరివేసుకొని  ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యా ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.