05-05-2025 11:05:27 PM
పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దు...
తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలి..
పట్టణ సిఐ శివశంకర్...
కోదాడ: మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులపై, వాహన యజమానులపై చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని కోదాడ పట్టణ సీఐ శివశంకర్(CI Shivashankar) సూచించారు. సోమవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్, రంగా థియేటర్ సెంటర్ వద్ద మైనర్లకు వాహనాలు ఇస్తే జరిగే ప్రమాదాలు బాధ్యులు అనే అంశంపై వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మైనర్ బాలికలు, బాలురలకు వాహనాలు ఇవ్వడం నేరమన్నారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని, ఏదైనా ప్రమాదాలు జరిగితే అందుకు వారే బాధ్యులవుతారని చెప్పారు. రహదారి భద్రతలో భాగంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యమన్నారు.
స్పెషల్ డ్రైవర్ లో 16 వాహనాలు పట్టుకున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు 18 ఏళ్లు నిండనీ పిల్లలకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్య నేరమన్నారు. 18 ఏళ్లు నిండి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే వాహనాలు నడపాలనీ తెలిపారు. పిల్లల పట్ల ఇష్టాలు ఉంటే వారికి వాహనాలు ఇవ్వకుండా... చదువులో మెరుగ్గా రాణించే విధంగా మోటివేషన్ చేయాలని అన్నారు. ఇప్పటికే మైనర్ల డ్రైవింగ్ పై దృష్టి సారించామని అన్నారు. భవిష్యత్లో మరింత కఠినతరం చేస్తామనీ, తల్లిదండ్రులు గమనించి పోలీసు వారికి సహకరించి మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా వాహనాలు ఇవ్వద్దని చెప్పారు. వాహనాలను స్టేషన్లో ఉంచి శనివారం రోజున తల్లిదండ్రులను పిలిపించి వారి కౌన్సిలింగ్ ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుధీర్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది వాహన చోదుకులు ఉన్నారు.