calender_icon.png 6 May, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వక్ఫ్’కు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ

06-05-2025 12:00:00 AM

జగిత్యాల, మే 5 (విజయక్రాంతి) : వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ముస్లింలు సో మవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జాయింట్ యాక్షన్ కమి టీ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ కాలనీల నుంచి వచ్చిన ముస్లింలు స మూహంగా ఏర్పడి, జామా మజీద్ నుండి క్లాక్ టవర్ మీదుగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. వేలాది ముస్లింలు పా ల్గొన్న ఈ నిరసన ర్యాలీలో ప్లకార్డులతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టరుకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.