07-10-2025 12:13:46 AM
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
రాజాపూర్ అక్టోబర్ 6: అధికారులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా పారదర్శకంగా పనులు చేయాలని జిల్లా కలెక్టర్జి ల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వఆసుపత్రి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తహ శీల్దార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేశా రు. ప్రభుత్వ దవాఖాన, తసీల్దార్ కార్యాలయంలో అధికారుల పనితీరుపై ప్రజలతో నేరుగా మాట్లాడారు. ప్రజా సమస్యల సత్వ రం పరిష్కారం కోసం అందరూ అధికారు లు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూ చించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రా ధాకృష్ణ, డిప్యూటీ తాసిల్దార్ భారతి, డాక్టర్ సుస్మిత అధికారులు పాల్గొన్నారు.