calender_icon.png 7 October, 2025 | 9:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలిసిరాని రిజర్వేషన్లు..

07-10-2025 12:14:36 AM

  1. కానరాని మండల నాయకులు..!

వెల్దుర్తి మండలంలో జోరుగా చర్చ

వెల్దుర్తి, అక్టోబర్ 6 :పది సంవత్సరాలు బిఆర్‌ఎస్ పాలనలో  రెండుసార్లు రిజర్వేషన్లు కలిసి రావడంతో గత ప్రభు త్వంలో బిఆర్‌ఎస్ మండల నాయకులకు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పది సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా పార్టీలు మారకుండా ఉన్న కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న స్థానిక సమరానికి నోటిఫికేషన్ విడుదల కావడంతో సంతోషపడ్డారు.

కానీ ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్లు పూర్తిగా మండలంలోని కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి, మండల నాయకులకు నిరాశే మిగిల్చాయి. మేజర్ పంచాయతీలైన వెల్దుర్తి, కుక్కునూరు గ్రామాల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడం, అలాగే మండల ఎంపీపీ, జడ్పిటిసి స్థానాలు కూడా ఎస్సీ రిజర్వేషన్లు రావడంతో మండలంలోని అన్ని పార్టీల బడా నాయకులు గ్రామాలకే పరిమితం కావడం విడ్డూరమని మండల ప్రజలు నాయకులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈసారి ఏ గ్రామంలో చూసినా రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో అన్ని గ్రామాల్లో దసరా వేడుకలు అరకొరగా జరగాయని మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు వాపోతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు 10 సంవత్సరాలుగా వేచి చూసి కనీసం ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎన్నికల్లో ఏదైనా అవకాశం వస్తుందని ఎదురుచూసినా నిరాశే మిగిలిందని కొందరు మండల నాయకులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామాల్లో సేవా భావంతో పనిచేస్తున్న నాయకులకు రిజర్వేషన్లు కూడా కలిసి రాకపోవడంతో వారు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్ని రోజులు ఆశగా ఎదురుచూసిన మండల నాయ కులు ఈ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేయనికి ముందుకు వస్తారా లేదా అని ప్రజలు గుసగుసలు పెడుతున్నారు.