ఎల్లూరు ఆశ్రమ పాఠశాలలో నిర్లక్ష్యం
విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్
పెంచికలపేట ఏప్రిల్ 3 (విజయక్రాంతి ): మండలములోని ఎల్లూరు ఆశ్రమ హైస్కూ ల్లో నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్కు గురైన ఘ టన ఆందోళన కలిగిస్తోంది. కలుషిత ఆహారం, తాగునీరు తీసుకోవడంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాగజ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అదేవిధముగా స్థానిక ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ అశ్రీఫ్ ఆశ్రమ పాఠశాలను సందర్శించి మిగిలిన విద్యార్థులకు కూడా ప్రాథమిక చికితను అందించి విద్యార్థులకు ఆరోగ్యాపరమయినా జాగ్రత్తలను సూచించారు. ఈ ఘటనకు ఎల్లూరు ఆశ్రమ హై స్కూల్ ప్రిన్సిపాల్ గోపాలరెడ్డి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వ్యక్తమవుతున్నా యి.
వంట సిబ్బంది కొరత కారణంగా స్థా నిక అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించడం ద్వారా విద్యార్థుల ప్రాణాలతో చెలగా టం ఆడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఐటీడీఏ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆశ్రమ పాఠశాలల్లో ఇలాంటి ఘ టనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




