4 April, 2026 | 2:25 AM

వరవర రంగనాయక స్వామి ఆలయంలో హోమాలు, అన్నదానం

04-04-2026 12:15 AM

కోదాడ ఏప్రిల్ 3, కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలోని వరవర రంగనాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం హోమాలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ ఇర్లా వరహాలరెడ్డి విజయలక్ష్మి మాట్లాడుతూ గురువారం రాత్రి స్వామి వారి కళ్యాణం జరిగిందని, ఈ సందర్భంగా శుక్రవారం  హోమాలు, అన్నదానం చేసినట్లు పేర్కొన్నారు. సర్పంచ్ బి స్నేహ దుర్గయ్య, మాజీ ఎంపీటీసీ సింగారెడ్డి హిమబిందు సుమన్ రెడ్డి, బండి చిన కోటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.