జేఈఈ మెయిన్‌లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
26-04-2024 12:36 AM
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీచైతన్య రికార్డు ఫలితాలను సాధించింది. 300కి 300 మార్కులు సాధించిన కేసీ బసవ రెడ్డి అనే విద్యార్థి ఆలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. అలాగే తోటంసెట్టి నికిలేష్ 3, హిమాన్షు తాలోర్ 6, రెడ్డి అనిల్ 9వ ర్యాంకు సాధించారు. 10లోపు నాలుగు ర్యాంకులతో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 100లోపు 25 ర్యాంకులు, 200లోపు 46 ర్యాంకులే కాకుండా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వంద పర్సంటైల్ సాధించిన వారి సంఖ్య 272 ఉందని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ తెలిపారు. నిరంతరం శ్రమించే టాప్ ఫ్యాకల్టీతోనే ఇంతటి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.






