28 May, 2026 | 2:48 AM

కంటోన్మెంట్ మిలిటరీ సబ్ ఏరియా కార్మికులకు జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యం

28-05-2026 01:39 AM

ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి యం నర్సింహా విమర్శ..

బోర్డు కార్యాలయం ముందు ధర్నా ...

ఏప్రిల్ నెల జీతం నేటికీ కూడా అందక కార్మికుల ఆందోళన..

సికింద్రాబాద్, మే 27 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మిలిటరీ సబ్ ఏరియాలలో పనిచేయున్న కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధిత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన నేటికి కూడా జీతాలు అందలేదని సంబంధిత కంటోన్మెంట్ అధికారులు కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు.

సబ్ ఏరియా కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) ఆధ్వర్యంలో బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి బోర్డు సీఈఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ మాట్లాడుతూ కాంట్రాక్టు లేబర్ చట్టం ప్రకారం కార్మికులకు ప్రతినెలా ఏడవ తేదీ లోపు జీతాలు చెల్లించాలని నిబంధన ఉన్నప్పటికీ సింగ్ సొల్యూషన్ అను కాంట్రాక్టు సంస్థ ప్రతినెల జీతాలు ఆలస్యంగా చెల్లిస్తూ ఉన్నదని ఏప్రిల్ నెల జీతం నేటికి కూడా ఇవ్వకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని వారు విమర్శించారు.

కాంట్రాక్టర్ చెబుతున్న దాని ప్రకారం సంస్థ పేరు మార్చుకోవడానికి బోర్డుకు అనుమతి పెట్టినందు వలన జీతాలు వేయలేదని అనడం అన్యాయమని తమ వ్యక్తిగత పనుల కోసం కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ తెలియజేశారు. తక్షణం కంటోన్మెంట్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకొని ప్రతి నెల జీతం ఏడవ తేదీలోపు వచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని లేని పక్షంలో లేబర్ కమిషనర్కు కంప్లైంట్ ఇవ్వన్నట్లు ఎం.నరసింహ తెలియజేశారు.

కార్మికులకు ప్రతినెలా చెల్లించాల్సిన జీతాలు పీఎఫ్ కూడా కాంట్రాక్టర్ సక్రమంగా చెల్లించడం లేదని ముఖ్య యజమానిగా ఉన్నటువంటి బోర్డు సీఈఓ సంబంధిత కాంట్రాక్టర్ పై తగు చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్మికులు కంటోన్మెంటు సీఈఓ కు వినతిపత్రం ఇచ్చి కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని కాంట్రాక్టు లేబర్ చట్టం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కార్మిక హక్కుల్ని పరిరక్షించాలని తెలియజేశారు.ఈ సందర్భంగా కార్మికులు బోర్డ్ కార్యాలయం ముందు నినాదాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కంట్రోన్మెంట్ బోర్డ్ సబ్ ఏరియాలలో పనిచేయుచున్న కార్మికులు పాల్గొన్నారు.