calender_icon.png 6 January, 2026 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు

04-01-2026 12:00:00 AM

  1. పాలమూరును రాజకీయాల కోసమే వాడుకుంటున్నారు 
  2. పీపీపీలో ఒకరిపై ఒకరు నెపం
  3. కేసీఆర్, రేవంత్‌రెడ్డిలపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం

మహబూబ్‌నగర్, జనవరి 3 (విజయక్రాం తి): పాలమూరు జిల్లాను కేవలం రాజకీయా ల కోసం మాత్రమే వాడుకుంటున్నారని, నీళ్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి కేసీఆర్‌కు, రేవంత్‌రెడ్డి ఇద్దరికీ లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీపీ)లతో ఒకరిపై ఒకరు నెపం నెట్టుకునే ప్రయత్నం తప్ప ఏమీ లేదన్నారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ పాలమూరు ప్రజలకు నష్టం చేసిన వారే అని విమర్శించారు.

జూరాల నుంచి మొదటి డీపీఆర్ ప్రకారం నీళ్లు తీసుకోవాలని ఉన్నదని అనేకసార్లు చెప్పడం జరిగిందన్నారు. మాయ మాటలతో మోసం చేసి మరోసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ నాటకాలు ఆడుతు న్నారని మండిపడ్డారు. తప్పులను కేసీఆర్‌పై నెట్టి తప్పించుకోవాలని కాంగ్రెస్ మరో నాట కం ఆడుతున్నదన్నారు. ఈ ఇద్దరి నాటకంలో పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పాల మూరు ప్రజలను పదేళ్లు కేసీఆర్ మోసం చేశారనే ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించారని తెలిపారు.

జూరాల అప్రోచ్ అయితేనే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవడానికి ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదని, డిండికి నీళ్లు తీసుకెళ్లడంతో పాలమూరు ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. డిండికి నీళ్లు తీసుకెళ్లడాన్ని గతంలో పార్టీలకు అతీతంగా వ్యతిరేకించారని, జూరాల నీళ్లు తీసుకునే పాలమూరు ప్రాజెక్ట్ డీపీఆర్ టేకాప్ చేయాలన్నారు. ఇంతకు ముందు చేసిన పాలమూరు ప్రాజెక్ట్ ను కల్వకుర్తిలో కలపాలని పేర్కొన్నారు. లేదా నాగర్ కర్నూల్, నల్లగొండ అని పేరు పెట్టాలని సూచించారు.

అందులో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో ఆ రెండు జిల్లాలు లేవని, అయినా పాలమూరు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్టాడటం లేదని ప్రశ్నించారు. డిండికి నీళ్లు తీసుకెళ్తుంటే నోర్లు మూసుకొని, చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఎందుకు సమీక్షలు పెట్ట డం లేదని నిలదీశారు. సమీక్షలకు నన్ను పిలవకపోయినా ఒకసారి వెళ్లాలని, రివ్యూలకు తనను ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై ఇరిగేషన్ నిపుణులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిం చాలని, వచ్చే మూడేళ్లలో అయిన పూర్తి చేసే చొరవ తీసుకోవాలని కోరారు.