calender_icon.png 7 January, 2026 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమ్యూనిజం అజరామరం

04-01-2026 12:00:00 AM

సీపీఐ నేత నారాయణ

చర్ల, జనవరి 3 (విజయక్రాంతి): వందేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సీపీఐ ఎన్నో ఒడిదుడుకులను చవిచూసిందని, రానున్న నవయుగం కూడా అజరామరమే అని, పార్టీ నేతలకు పదవులకంటే ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధానం అని సీపీఐ సీనియర్ నాయకుడు, జాతీయ పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కే నారాయణ అన్నారు. సీపీఐ శత వసంత ఉత్సవాల్లో భాగంగా ప్రచార జాతాను చర్ల మండ ల కేంద్రంలో జెండా ఊపి ఆయన ప్రారంభించారు.

సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యలు కల్లూరి వెంకటేశ్వర రావు అధ్యక్షన జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణ మాట్లాడుతూ.. బలహీన వర్గాల పక్షాన సిపిఐ అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. నేడు దేశంలో అమలవుతున్న అనేక చట్టాలు కమ్యూనిస్టు పార్టీ పోరాట ఫలితమే అని, పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం  ఇష్టానుసారంగా పేర్లు మారుస్తుందని మండిపడ్డారు. ఆర్ ఎస్ ఎస్, జన సంఘ్ లాంటి మతోన్మాద శక్తులు దేశ ప్రజల శ్రేయస్సు కోసం ఏమైనా చేశాయా అని ప్రశ్నినించారు.

గోదావరి జలాలు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయని ఆ సమస్యను ఇరు ముఖ్యమం త్రులు  పరిష్కరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో భద్రాచలానికి చెందిన ఐదు గ్రామపంచాయతీలను ఆంధ్రాలో విలీనం చేశారని, ఆ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్ నాయకులు అలిగి అసెంబ్లీకి రావడం లేదని, వారు పదవులకు రాజీనామా చేయాల న్నారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించ నున్న సీపీఐ శతవసంత ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాలన్నారు.