calender_icon.png 7 January, 2026 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సమస్యలు పరిష్కరించాలి

04-01-2026 12:00:00 AM

సీఎంకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి వినతి 

ఆమనగల్లు, జనవరి 3 (విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం సీఎం రేవంత్‌రెడ్డికి నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెల్దండ, చారగొండ మండలాల సమీపంలో చేపడుతున్న రిజర్వాయర్ కారణంగా ఎర్రవెల్లి గ్రా మాన్ని ముంపునకు గురి కాకుండా చూడాల ని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రీన్ ఫీల్ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందజేసి వారి ఆదుకోవాలని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన సీఎం కల్వకుర్తి రైతులకు న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.