19 April, 2026 | 7:54 PM

ఎన్ ఈ పి 20 20 ను రద్దు చేయాలి

08-12-2024 11:12 PM

ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి... 

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం ఎన్.ఈ.పి 20 20ని తక్షణమే రద్దు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్ లో నిర్వహించిన టి ఎస్ యు టి ఎఫ్ జిల్లా ఐదవ మహాసభలో ఆయన ముఖ్య అతిగా పాల్గొనే మాట్లాడారు. నూతన విద్యా విధానం ద్వారా కనీస మౌలిక సదుపాయాలు లేని అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ నుంచి రెండవ తరగతి వరకు తరగతిలో నిర్వహించాల్సిన పరిస్థితి వచిందన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యకు ఆత్మ కలిగించే ఎన్ ఈ పి 2020లో మార్పులైనా చేయాలి, రద్దయినా చేయాల్సిందే అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న డిఏ లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలన్నారు. కుబేరులో పెండింగ్ లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం బేసిక్ పెయిన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 317 జీవో వల్ల స్థానికత కోల్పోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంహెచ్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, ఏపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నవరపు కనకయ్య, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు లిక్కి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు కొత్తగూడెం పట్టణంలో ఉపాధ్యాయులు భారీ ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్తగూడెం క్లబ్ లో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పతాకావిష్కరణతో మహాసభ ప్రారంభమైంది.