19 April, 2026 | 9:34 PM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్...

08-12-2024 11:19 PM

అనతికాలంలోనే కేసు ను ఛేదించిన పోలీసులు... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో జరిగిన భారీ చోరీకి సంబంధించిన కేసును పోలీసులు అనతి కాలంలోనే చేదించారు. దొంగతనంకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ మేరకు సీఐ సాయినాథ్ ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బేలలోని శ్రీకర్ మార్ట్ లో 8 మంది కలిసి 5 లక్షల 87 వేలు దొంగిలించారు. కస్టమర్లుగా వచ్చి కౌంటర్ పై ఉన్న భారీ నగదును ఎత్తుకెళ్లిన ఘటన ఈనెల 4న చోటు చేసుకుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. మధ్యప్రదేశ్ కు చెందిన రాజ్నాథ్ రాథోడ్, అభిషేక్ సింగ్ రాథోడ్, షారుక్, సాహిర్, ఋషి, సాహిర్, హిరా బాయి, బిజిలీ బాయి 8 మంది ముఠాగా ఏర్పడి ఈ చోరీకి పాల్పడ్డారని, అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని సీఐ తెలిపారు. పట్టుబడ్డ వారి నుండి రూ. 2 లక్షల 41 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారన్నారు. మీడియా సమావేశంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై దివ్యభారతి తదితరులు ఉన్నారు.