ప్రముఖ సంఘ సేవకుడు ఆనంద్ కృష్ణారెడ్డికి రాష్ట్రస్థాయి అవార్డు
పటాన్ చెరు (విజయక్రాంతి): ప్రముఖ సంఘ సేవకుడు, కేజేఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారిని గుర్తించి విశ్వగురు వరల్డ్ రికార్డు వారు ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయి కామదేను అవార్డులను అందిస్తున్నారు. ఈ సంవత్సరం నిర్వహించిన కామదేను 2024 అవార్డు ప్రధానోత్సవంలో జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీకి చెందిన ఆనంద్ కృష్ణారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
ఆదివారం హైదరాబాదులోని తెలంగాణ టోల్ ప్లాజాలో సంస్థ ప్రతినిధులు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కేజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ఆనంద్ కృష్ణారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు సత్యవోలు రాంబాబు, ప్రొఫెసర్ సారంగపాణి ఇతర ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తానని ఆయన తెలిపారు.






