10 March, 2026 | 8:23 PM

నెస్ట్ ఫీటల్ మెడిసిన్ సెంటర్ ప్రారంభం

09-03-2026 12:48 AM

హజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ముషీరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భం గా గర్భస్థ శిశువుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేకమైన, సమగ్రమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా నగరంలోని వెస్ట్‌ఎండ్ మాల్‌లో ఏర్పాటు చేసిన ‘నెస్ట్ ఫీటల్ మెడిసి న్ సెంటర్’ను ఆదివారం కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ  జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలను, మాతృత్వాన్ని జరుపుకునే రోజు న సురక్షితమైన, ఆరోగ్యకరమైన గర్భధారణకు ప్రాధా న్యత ఇవ్వడం గురించి ఈ చొరవ ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతుందని పేర్కొన్నారు. డాక్టర్ అమిత ఇందర్సేన్ మాట్లాడుతూ అంకితభావం కలిగిన బృందంతో తల్లులు, శిశువుల కోసం సురక్షితమైన గర్భధారణలు మెరుగైన ఫలితాలను అందించాలని ఈ కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.