1 September, 2026 | 11:06 PM

Breaking News

అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక తనిఖీలు   •   చీటింగ్, లూటింగ్ లో ఆరితేరిన రేవంత్ రెడ్డి సర్కార్   •   కేజీబీవీ హాస్టల్లో పరిశుభ్రతను పాటించాలి: అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్.   •   ప్రశ్నిస్తే దాడులు చేయడం హేయమైన చర్య   •   నేరేడుచర్లలోని అంజలి, పినాకిల్, శ్రీ చైతన్య, శ్రీవాణి పాఠశాలల్లో కరపత్ర ప్రచారం   •   తాడ్కోల్ గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ   •   మహిళా సంఘాల ఉపాధికి మార్గం.. యూనిఫాంలు త్వరితగతిన అందించాలి   •   పల్లగుట్టను ధ్వంసం చేస్తే అంధకారమే   •   నిరుపేదలకు సీఎం సహాయనిధి అండ   •   పాపన్ పేటలో సర్ నోటీసులు వచ్చిన వారిపై విచారణ.. తహసిల్దార్ రామ్మోహన్ రావు   •  

ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.58 లక్షల కోట్లు

18-05-2024 | 12:05am

అంచనాల్ని మించి 18 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, మే 17: కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్ని మించాయి. బడ్జెట్లో సవరించిన అంచనాల్ని మించి రూ.19.58 లక్షల కోట్లు వసూలైనట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో 2023 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ.19.45 లక్షల కోట్లకు పెంచుతూ సవరించింది. ఈ సవరించిన మొత్తానికి రూ.13,000 కోట్లు అధికంగా ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్నుల నికర వసూళ్లు జరిగినట్టు సీబీడీటీ వివరించింది. తొలి బడ్జెట్ అంచనాలకంటే ఈ మొత్తం రూ.1.35 లక్షల కోట్లు ఎక్కువని తెలిపింది. 2023 స్థూల పన్నుల వసూళ్లు 18.48 శాతం వృద్ధితో రూ.23.37 లక్షల కోట్లకు చేరగా, రిఫండ్స్ పోను నికర వసూళ్లు 17.7 శాతం వృద్ధితో రూ.19.58 లక్షల కోట్ల వద్ద నిలిచినట్టు ప్రత్యక్ష పన్నుల శాఖ తెలిపింది. అంతక్రితం 2022 ఆర్థిక సంవత్సరంలో రూ.16.64 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2023 బడ్జెట్లో తొలుత రూ.18.23 లక్షల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, తదుపరి దీనిని రూ.19.45 లక్షల కోట్లకు సవరించారు. 

భారీగా పెరిగిన వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు

ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయాల వృద్ధిని సూచిస్తూ ఆ పన్నుల నికర వసూళ్లు భారీగా 25.23 శాతం పెరిగి రూ.10.44 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.8.33 లక్షల కోట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు నమోదయ్యాయి.