5 July, 2026 | 4:59 PM

టీవీఎస్ అపాచి బ్లాక్ ఎడిషన్ విడుదల

18-05-2024 12:05 AM

ధర రూ.1.10 లక్షలు

న్యూఢిల్లీ, మే 17: టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ రేంజ్ అపాచి ఆర్‌టీఆర్ 160 సిరీస్‌లో శుక్రవారం ‘బ్లేజ్ ఆఫ్ బ్లాక్’ పేరుతో డార్క్ ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్ అపాచి ఆర్‌టీఆర్ 160 సిరీస్ ధర రూ.1,09,990కాగా, అపాచి ఆర్‌టీఆర్ 160 4 వాల్వ్ ధర రూ.1,19,990 (ఎక్స్ షోరూమ్). బ్లాక్ ఫినిష్‌తో, తక్కువ గ్రాఫిక్ డిజైన్‌తో లభించే ఈ బైక్ ట్యాంక్‌పై టీవీఎస్ లోగో ఎంబోజ్ చేశారు.