05-12-2025 01:15:35 AM
కోల్‌కత్తా, డిసెంబర్ ౪: పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదు ప్రతిరూపాన్ని నిర్మించాలనే ప్రతిపాదనపై తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్‌ను ఆ పార్టీ అధిష్ఠానవర్గం గురువారం సస్పెండ్ చేసింది. బీజేపీ మద్దతుతో రాజకీయ సమస్యలను మతత్వానికి దారితీసేందుకు హుమాయున్ కబీర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ టీఎంసీ సీనియర్ నేత, కోల్‌కత్తా మేయర్ ఫిర్హాద్ హకీమ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
పార్టీ గతంలో కబీర్‌ను చాలాసార్లు హెచ్చరించిందని పేర్కొన్నారు. మేము అతన్ని మూడుసార్లు హెచ్చరించాం. అయినప్పటికీ అతను ఇలాగే చేస్తున్నాడు. అం దుకే మేము హుమాయున్ కబీర్‌ను సస్పెండ్ చేస్తున్నామని, పార్టీకి అతనితో ఎలాంటి సంబంధం ఉండదని హకీమ్ తెలిపారు. కబీర్ ఇటీవల బాబ్రీ మసీదును నిర్మిస్తానని ప్రకటించిన తర్వాత పార్టీ అప్రమత్తమైందన్నారు.