calender_icon.png 11 February, 2026 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నమీబియాపై నెదర్లాండ్స్ ఘనవిజయం

11-02-2026 02:20:36 AM

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్ బోణీ కొట్టింది. పాకిస్థాన్‌తో పరాజయం నుంచి త్వరగానే కోలుకున్న ఆ జట్టుఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నమీబియాపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. బాస్ డీ లీడే ఆ ల్రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 156 పరుగులు చేసింది. జాన్ నికోల్ లాఫ్టీ 38 బంతుల్లో 42, జాన్ ఫ్రైలింక్ 26 బంతుల్లో 3 30 పరుగులతో రాణించారు.

నమీబియా బ్యాటర్లలో నలుగురు మా త్రమే రెండెంకలే స్కోర్ చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే , లోగన్ వాన్ బ్రీక్ రెండేసి వికెట్లు తీయ గా.. ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్ చెరో వికెట్ పడగొట్టారు. తర్వాత 159 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.  బాస్ డి లీడే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

కేవలం 48 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అతనితో పాటు  అకెర్మన్ (32), మైఖేల్ లెవిట్ (28) రాణించారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వెరడ్స్ కూడా దూకుడుగా ఆడడంతో  నమీబియా 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది.