2 June, 2026 | 7:15 PM

Breaking News

ఎమ్మెల్యేను అవమానపరచలేదు   •   కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •  

యూఎస్‌ఏపై పాకిస్థాన్ విజయం

11-02-2026 02:19 AM

గ్రూప్ ఏలో టాప్ ప్లేస్

కొలంబో , ఫిబ్రవరి 10 : టీ20 ప్రపంచకప్ లో యూఎస్‌ఏ వరుసగా రెండో పరాజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్‌లో భారత్‌పై ఆకట్టుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన 56 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించిన సయీమ్ అయూబ్ (19), కెప్టెన్ సల్మాన్ అఘా(1) వెంటవెంటనే ఔటయ్యారు.

ఈ దశలో ఫర్హాన్, బాబర్ అజామ్ పాక్‌ను ఆదుకున్నారు. ధాటిగా ఆడుతూ మూడో వికెట్ కు 52 బంతుల్లోనే 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా..బాబర్ అజామ్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 46 రన్స్ కు వెనుదిరిగాడు.

చివర్లో షాదాబ్ ఖాన్ మెరుపులు మెరిపించాడు.  దీంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 9  వికెట్లకు 190 పరుగులు చేసింది.  తర్వాత భారీ లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన యూఎస్‌ఏ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు ఆడ్రియస్ గౌస్ , జహంగీర్ తొలి వికెట్ కు 42 పరుగులు జోడించారు. గౌస్ (13) పరుగులకే ఔటవగా... కెప్టెన్ మోనాంక్ పటేల్ (3) నిరాశపరిచాడు.  యూఎస్‌ఏ 20 ఓవర్లలో 158 పరుగులే చేయగలిగింది.