12-02-2026 12:00:00 AM
యూఏఈపై కివీస్ సూపర్ విక్టరీ
చెన్నై, ఫిబ్రవరి 10 : టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ రెండో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో ఆప్ఘని స్థాన్‌పై గెలిచిన కివీస్ తాజాగా యూఏ ఈని చిత్తు చే సింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో న్యూజి లాండ్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధిం చింది. ఓపెనర్లు ఫిన్ అలెన్, సిఫర్ట్ రికార్డు పార్టన ర్‌షిప్ హైలెట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న యూఏఈ 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది.
ఓపె నర్ ఆర్యాన్ష్ శర్మ(8) విఫలమైనా కెప్టెన్ మహమ్మద్ వసీమ్, వన్‌డౌన్ బ్యాటర్ అలిషాన్ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. వీరిద్దరూ 77 బంతుల్లోనే 107 పరుగుల భాగస్వామ్యం నెలకొ ల్పారు. చివర్లో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 200 ప్లస్ స్కోరు సాధిస్తుం దనుకున్న యూఏఈని 173 పరుగులకే పరిమితం చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 , డఫీ, ఫెర్గ్యుసన్ , శాంట్నర్, ఫిలిప్స్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
174 పరుగుల లక్ష్యఛేదన లో న్యూజి లాండ్ ఓపెనర్లు సిఫర్ట్ , ఫిన్ అలెన్ రెచ్చిపోయారు. యూఏఈ బౌలర్లను ఉతికారేసిన వీరిద్దరూ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. పోటాపోటీగా భారీ షాట్లతో చెలరేగి పోవడంతో యూఏఈ బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు అజేయంగా 175 పరుగుల వరల్డ్ రికార్డ్ పా ర్టన ర్‌షిప్ నెలకొల్పారు. టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.