2 June, 2026 | 6:50 PM

Breaking News

మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •   అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కే.అజయ్ కుమార్   •   ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న డాక్టర్ కోట నీలిమ   •   జవహర్‌నగర్‌లో భారీ ఎత్తున మానవహారం   •   భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో విశేష సేవలు అందించిన లైన్‌మ్యాన్ దేవ్ సింగ్ కు ఉత్తమ ఉద్యోగి అవార్డు   •   మండల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   గుంజపడుగు గ్రామంలో వ్యర్థాలపై ప్రజలకు సర్పంచ్ అవగాహన   •  

పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు

02-06-2026 06:13 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాటూర్, మాసానిపల్లి, వదల్పర్తి గ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో పిసిసి కేంద్రాలను డిసిఎస్ఓ.వెంకటేశ్వర్లు మరియు డిఎం.శ్రీకాంత్ కలిసి సందర్శించి పరిశీలించారు. పీసీసీ కేంద్రాలలో వడ్ల కాంట చేయడంలో ఆలస్యాలపై, సమస్యలపై రైతులను ఆరాధిస్తారు. జూన్ మాసం వచ్చిందని రైతులెవరు ఆచార్య పడవద్దని పూర్తిస్థాయిలో మరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని లేనిపోని అపోహలకు గురికావద్దని రైతులకు ధైర్యం నింపారు. మాసంపల్లి పిసిసి సెంటర్ విజయవంతంగా క్లోజ్ చేయడం జరిగిందన్నారు. మండలంలోని మిగతా పీసీసీ సెంటర్లను కూడా పూర్తిస్థాయిలో క్లోజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.మాసంపల్లి పీసీసీ సెంటర్ క్లోజ్ చేయడానికి సహకరించిన జిల్లా అధికారులకు నాగిరెడ్డిపేట్ మండల ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.