26 June, 2026 | 2:23 AM

సాగునీరందించని నెట్టెంపాడు కాలువలు

26-06-2026 01:22 AM

ఇటిక్యాల, జూన్ 25: మండలంలో నిర్మించిన నెట్టెంపాడు ప్రాజెక్టు కాలువలు నిరుపయోగంగా మారాయని శనిగపల్లి, ఉదండాపురం, చాగాపురం తదితర గ్రామాల రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఆయకట్టు పొలాలకు సాగునీటిని అందించడానికి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి కాలువలు నిర్మించినా, ప్రస్తుత తరుణంలో తమకు ఎలాంటి ఉపయోగం లే కుండా పోయిందని వారు పేర్కొన్నారు. పంటలు ఎండిపోకుండా ఉండాలంటే తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారులు స్పందించి, రై తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.