9 April, 2026 | 9:09 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

జై భారతి, క్రెసెంట్ స్కూల్ వద్ద ప్రమాదాల ముప్పు

16-02-2026 06:55 PM

– తక్షణ చర్యలు కోరిన బీజేపీ నేతలు

సనత్‌నగర్,(విజయక్రాంతి): నేడు బి.కె.గూడాలోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అమీర్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సమస్యలపై డిప్యూటీ కమిషనర్ సుజాతకి బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేకంగా బి.కె.గూడాలోని జై భారతి హై స్కూల్, క్రెసెంట్ కాన్వెంట్ స్కూల్ పాఠశాలల సమీపంలో వేగ నియంత్రణలు (స్పీడ్ బ్రేకర్లు) ఏర్పాటు చేయాలని కోరారు.

ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో విద్యార్థులకు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకుని వేగ నియంత్రణలను ఏర్పాటు చేయాలని డీసీ సుజాతని కోరినట్లు తెలిపారు. ఈ కరిక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల మహేష్, పెరుమాండ్ల నరేందర్ దశరథ్ గౌడ్, మల్లికార్జున, అనిల్ తదితరులు పాల్గొన్నారు.