రేపు డీసీసీ నూతన కమిటీ బాధ్యతలు స్వీకరణ
ఖమ్మం,(విజయ క్రాంతి): జిల్లా కాంగ్రెస్ కమిటీ లో నూతనంగా TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా ఎంపికైన జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, కోశాధికారి, అధికార ప్రతినిధులకు, కార్యదర్శులకు, ఎగ్జిక్యూటివ్ సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవంను మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 10.00 గంటలకు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గ పదవీ బాధ్యతల స్వీకార మహోత్సం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రెవెన్యూ ,గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ, సహకార మార్కెటింగ్,చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, శాసనసభ సభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ , మట్టా రాగమయి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొంటారని తెలిపారు. సభ్యులు అందరు సకాలంలో విచ్చేయాలని కోరారు.




