పాత కరెంట్ వైర్ల స్థానంలో కొత్తవి వేయాలి
22-05-2026 12:03 AM
- నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వీహెచ్ లేఖ
హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో పాతపడిన కరెంట్ వైర్ల కారణంగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నిజాం కా లంలో వేయగా, మరికొన్ని 50 ఏళ్ల నాటి వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణకు కొత్త వైర్లను వేయాలని డీప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు గురువారం లేఖ రాశారు. ఈ సందర్భంగా వీహెచ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సిటీలో 50 ఏళ్ల క్రితం వేసిన కరెంట్ వైర్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. కొత్త వైర్లను వేయ డం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని, తద్వారా ప్రాణనష్టంతో పాటు ఆస్తినష్టాన్ని కూడా భారీగా తగ్గించవచ్చని భట్టికి రాసిన లేఖలో వీహెచ్ పేర్కొన్నారు.






