14 August, 2026 | 8:20 PM

Breaking News

సబ్ స్టేషన్ పనులు త్వరలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం   •   వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

మేడ్చల్ జిల్లా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌కు కొత్త అధ్యక్షుడు నియామకం

01-05-2026 10:37 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా యూనివర్సల్ హ్యూమన్ రైట్స్, లీగల్ అవేర్‌నెస్ అసోసియేషన్‌కు నూతన అధ్యక్షుడిగా కసాల కనకచారి (కె.కె. చారి) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజ్గిరి డివిజన్ ఏసీపీ చక్రపాణి, సిఐ ఆంజనేయులు చేతుల మీదుగా కనకచారికి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కసాల కనకచారి మాట్లాడుతూ, సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల్లో చట్టపరమైన అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.