రైతన్న ఆందోళన చెందకు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా నష్టపరిహారం ఇప్పిస్తా ఎమ్మెల్యే
బోథ్,(విజయక్రాంతి): బోథ్ మండలంలోని పోచ్చర గ్రామానికి చెందిన నలుగురు రైతుల కు చెందిన పంట పొలాల్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న రైతుల భూముల్లో శుక్రవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో దాదాపు 9 లక్షల రూపాయల మేరకు నష్టం సంభవించింది. పోచ్చ ర గ్రామానికి చెందిన గొండ్ల రమణ అనే రైతుకు చెందిన 7 ఎకరాల మొక్కజొన్న ఖాళీ బూడిద కావడంతో పాటు 20 పైపులు సంఘటనలో దగ్ధమయ్యాయి.
దీంతో రైతుకు ఏడు లక్షల రూపాయల మేరకు నష్టం సంభవించింది అంతేగాక కంసాలి వెంకటి కి చెందిన 30 పైపులు యాటకరి రమేష్ కు చెందిన 20 యాటకారి నారాయణ చెందిన 20 పైపులు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. చేతికి అందిన పంట ఖాళీ బూడిద కావడంతో గుండ్ల రమణ కుటుంబీకులు కన్నీరు అవుతున్నారు అయితే విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. నష్టపోయిన రైతులు తమ గోడు వినిపించడంతో ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు .ఆందోళన చెందవద్దని. పంట నష్టపరిహారం వచ్చే విధంగా అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంఘటన జరిగిన తీరు గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.ఏది ఏమైనా. జరిగిన సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆయన వెంట స్థానిక రైతులు నాయకులు ఉన్నారు






