ప్రతి నియోజకవర్గానికి 4వేల ఇందిరమ్మ ఇళ్లు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కడ్తాల్ నూతన తహసీల్దార్ కార్యాలయం ప్రారంభం
రంగారెడ్డి, ఆక్టోబర్7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలో తీసుకువచ్చే కొత్త రెవెన్యూ చట్టం దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏమాత్రం అవగాహన లేకుండా ధరణిని తీసుకొచ్చి రైతులకు లేనిపోని కష్టాలను తీసుకొచ్చిందని ఆయన మండిపడ్డా రు.
ప్రస్తుతం ప్రభుత్వ భూముల రికార్డులో ఎలాంటి టాంపరింగ్‌కు అవకాశం లేకుండా ప్రత్యేక డిజిటలైజేషన్ కార్యక్రమానికి శ్రీకా రం చుడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలో రూ.1.18 కోట్లతో నిర్మించిన నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ శశాంకతో కలిసి మంత్రి పొంగులేటి ప్రారభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ..రాష్ట్రంలో నియోజకవర్గానికి 3500 నుంచి 4వేల వరకు ఇందిరమ్మ ఇళ్లను మంజురూ చేయనున్నామని, డిసెంబర్ నాటికి రైతలకు భూ పంపిణీ, పట్టాలు లేని సేద్యం చేస్తున్న రైతులకు భూ హక్కులు కల్పిస్తామని ఆయన హామినిచ్చారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు.
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారా యణరెడ్డి మంత్రి పొంగులేటికి విజ్ఙప్తి చేశా రు. నూతనంగా ఏర్పాటైన మండలానికి 30 పడకల ప్రభుత్వ దవాఖాన, ప్రభుత్వ జూనియర్ కళాశాల, నాలుగు మండలాల కూడలి ఉన్న ఆమనగల్లుకు ఆర్డీవోను మంజురూ చేయాలని, కల్వకుర్తి నియోజకవర్గంలోని ఖాళీగా ఉన్న మండలాలకు నూతన సర్వేయర్లను నియమించాలని కోరారు.
అనంతరం గౌడ కులస్తులకు కాటమ య్య కిట్స్ (మోకులు), లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు సభ్యుడు ఠాగూర్ బాలాజీసింగ్, తహసీల్దార్ ముంతాజ్ బేగం, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, పీసీసీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, హన్మానాయక్, బీక్యానాయక్, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, యాదయ్యగౌడ్, జహంగీర్ అలీ, రామకృష్ణ, అద్దాల రాములు తదితరులు పాల్గొన్నారు.